Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్‌తో పాటు శ్వాసకోశ వ్యాధుల పట్ల కూడా.
- డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
జెనీవా : రాబోయే సీజనులో కోవిడ్‌తో పాటు ఇతర శ్వాసకోశ వ్యాధులు కూడా పెచ్చరిల్లే అవకాశం వున్నందున వాటిపట్ల అప్రమత్తంగా వుంటూ పూర్తి సన్నద్ధతతో వుండాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది.
వసంత రుతువులో ఇన్ఫ్లూయంజా వంటి వైరస్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని డాక్టర్ మరియా వాన్ ఖెర్కోవ్ వ్యాఖ్యానించారు.గతవారంలో ప్రపంచవ్యాప్తంగా కోటిన్నరకి పైగా కొత్త కోవిడ్ కేసులు వచ్చాయన్నారు. దాదాపు అన్ని దేశాల్లోనూ డెల్టా వేరియంట్ స్థానే ఒమిక్రాన్ వేగంగా వ్యాపించడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనామ్ గెబ్రియెసెస్ వ్యాఖ్యానించారు. అయితే గతేడాది అక్టోబరు నుంచి మరణాల సంఖ్య సగటున 48వేలుగా స్థిరంగానే వుందని అన్నారు. పలు దేశాల్లో ఆస్పత్రుల్లో చేరే రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ గతంలో వున్న స్థాయిలో అయితే లేదని అన్నారు. వ్యాక్సినేషన్లు, లేదా గతంలో కరోనా వచ్చి తగ్గడం వల్ల పెరిగిన రోగ నిరోధక వ్యవస్థ ఒక కారణం కావచ్చని లేదా ఒమిక్రాన్ వేరియంట్ అంత తీవ్రంగా లేకపోయికూడా వుండవచ్చని అన్నారు. అయినప్పటికీ వ్యాక్సిన్ తీసుకోని వారికి ఇది ప్రమాదకరమైన వైరస్సేనని చెప్పారు.