Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : లాక్డౌన్ సమయంలో పార్టీకి హాజరైనందుకు క్షమించాలంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అంగీకరించిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయాలంటూ సీనియర్ ఎంపీలు కోరారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో తలెత్తిన ఆగ్రహాన్ని అర్థం చేసుకున్నానని అందుకే క్షమాపణలు చెబుతున్నానని జాన్సన్ తెలిపారు. సీనియర్ టోరీలు ప్రధాని రాజీనామాను కోరుతుండగా, కేబినెట్ సభ్యులు జాన్సన్కు అండగా నిలబడ్డారు. ఆయన ప్రధాని, ఈ నిబంధనలు విధించింది కూడా ఆయన ప్రభుత్వమే, ఆయనే వీటిని ఉల్లంఘిస్తే, ఈ చర్యలకు ఆయనను జవాబుదారీ చేయాల్సిందేనని స్కాటిష్ పార్లమెంట్ సభ్యుడు రాస్ స్పష్టం చేశారు. ఈ మేరకు 1922 కమిటీకి తాను లేఖ కూడా రాశానని , ప్రధాని పట్ల తనకు విశ్వాసం కొరవడిందని పేర్కొనాల్సిందిగా కోరానని తెలిపారు. దీనిపై ప్రతినిధుల సభ నేత జాకబ్ రీస్ మాగ్ స్పందిస్తూ, ప్రభుత్వం పట్ల ఎప్పుడూ అసంతృప్తితో వున్నవారే ఇప్పుడు రాజీనామా కోరుతున్నారని అన్నారు. కన్జర్వేటివ్ ఎంపి ఆండ్రూ పెర్సీ ఈ వ్యాఖ్యలతో విభేదించారు.