Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాకు స్పష్టం చేసిన క్రెమ్లిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అమెరికా వ్యక్తిగతంగా ఆంక్షలు విధిస్తే.. రష్యాతో సంబంధాలన్నింటినీ తెగతెంపులు చేసుకోవాలని అమెరి కా నిర్ణయించిందని భావిస్తామని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన సెనెటర్ల బృందం రూపొం దించిన పెనాల్టీల గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. పుతిన్‌పై ప్రత్యక్ష ఆంక్షలను విధించడం, రష్యన్ బ్యాంకులను చిక్కుల్లో పెట్టడానికి ఉద్దేశించిన చర్యలతో సహా పలు ప్రతిపాదనలను సెనెటర్ల బృందం చేసిందని దిమిత్రి తెలిపారు. అయితే వీటిపై వెంటనే స్పందించాలని రష్యా భావించడం లేదనీ, ఎందుకంటే ఎంతో కొంత ఇంగిత జ్ఞానం వుంటుందని ఆశిస్తున్నామని అన్నారు. ఒక దేశాధినేతపై ఆంక్షలు విధించడమంటే ఆ దేశంతో సంబంధాలను తెగతెంపులు చేసుకోవడంగానే భావిస్తామని ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిలువరించడానికి గానూ ఈ ప్రతిపాదిత చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఉక్రెయిన్ సరిహద్దులకు లక్షమందికి పైగా బలగాలను రష్యా తరలించిందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. దీంతో సమీప భవిష్యత్తులో సైనిక దాడి తప్పదని భయాందోళనలు నెలకొన్నాయి. కాగారష్యా ఈ ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చుతోంది. తమ స్వంత దేశంలో ఎక్కడకుకావాలంటే అక్కడకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బలగాలను తరలించుకునే హక్కు వుందని చెబుతోంది.