Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూమికన్నా 2.6రెట్లు పెద్దది ?
న్యూయార్క్ : సౌర వ్యవస్థకు వెలుపల మొదటి చందమామను కనుగొన్నామని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇప్పటికి ఈ నిర్ధారణలు తాత్కాలికమే. ఈ ఖగోళ వస్తువును నేరుగా పరిశీలించడానికి కూడా వీల్లేనంత సుదూరంలో వుంది. ఆ వస్తువు నుండి వస్తున్న సంకేతాలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు సైన్స్ జర్నల్ నేచర్ ఆస్ట్రానమీలో ప్రచురితమయ్యాయి. భూమికి 5500 కాంతిసంవత్సరాల దూరంలో వున్న నక్షత్రం చుట్టూ కక్ష్యలో తిరుగుతున్న చందమామకు కెప్లర్-1708 బి-ఐగా పేరు పెట్టారు. కెప్లర్ టెలిస్కోప్ ద్వారా అందిన సాక్ష్యాధారాలను బట్టి చూసినట్లైతే కొత్తగా కనుగొన్న చందమామ, భూమికన్నా 2.6రెట్లు పరిమాణంలో పెద్దదిగా వుండవచ్చు. దాన్నిండా పూర్తిగా వాయువులు నిండి వుంటాయని భావిస్తున్నారు.