Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్‌తో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో దేశ అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరు రాష్ట్రాల్లోని ఆస్పత్రులకు భారీగా సైనిక ఆరోగ్య కార్యకర్తలను తరలిస్తామని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడంలో సాయం చేసేందుకు ఉచితంగా మాస్కులు అందిస్తామని, మరిన్ని ఉచిత పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతున్నదని, ఆరోగ్య సౌకర్యాలు, సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే వారంలో వెయ్యి మంది సైనిక ఆరోగ్య సిబ్బందిని దశల వారీగా ఆస్పత్రులకు పంపుతామని ప్రకటించారు. తొలి దశలో మిచిగాన్, న్యూజెర్సీ, న్యూమెక్సికో, న్యూయార్క్, ఒహియో, రోడ్ ఐలాండ్ రాష్ట్రాలకు మిలటరీ వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది బృందాలను పంపిస్తామన్నారు.