Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పుకోవాల్సిందేనంటున్న సొంత పార్టీ ఎంపీలు
లండన్ : లాక్డౌన్ సమయంలో పార్టీకి హాజరైనందుకు క్షమించాలంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అంగీకరించినందున ఆయన ఆ పదవిలో కొనసాగడానికి అనర్హుడని ప్రతిపక్ష లేబర్ పార్టీనే కాదు, బోరిస్ సొంత పార్టీ (టోరీ) ఎంపీలు కూడా డిమాండ్ చేశారు. దీంతో బోరిస్ తీవ్ర ఇరకాటంలో పడ్డారు. కోవిడ్ ఆంక్షలను విధించిన ప్రధానే వాటిని ఉల్లంఘించడం తీవ్రమైన తప్పిదమని, ఈ చర్యలకు ఆయనను జవాబుదారీ వహించాలని టోరీ పార్టీకి చెందిన స్కాటిష్ ఎంపీ రాస్ డిమాండ్ చేశారు. ఆయనకు మరి కొందరు ఎంపీలు మద్దతు పలికారు. బోరిస్‌పై తాను విశ్వాసం కోల్పోయానని రాస్ 1922 కమిటీకి లేఖ రాశారు. టోరీ పార్టీలో నాయకత్వ మార్పును నిర్ణయించే అధికారం ఈ 1922 కమిటీకే ఉంది. నాయకత్వ మార్పును కోరుతూ 65 మంది ఎంపీలు కోరితే ఈ కమిటీ నాయకత్వ మార్పు ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. దీనిపై ప్రతినిధుల సభ నేత జాకబ్ రీస్ మాగ్ స్పందిస్తూ, ప్రభుత్వం పట్ల ఎప్పుడూ అసంతృప్తితో వున్నవారే ఇప్పుడు రాజీనామా కోరుతున్నారని అన్నారు.