Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్బోర్న్ : ప్రముఖ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ వీసా పునరుద్దరణను ఆస్ట్రేలియా అధికారులు రెండోసారి కూడా తిరస్కరించడాన్ని అక్కడి కోర్టు కూడా సమర్ధించింది. దీంతో ఈ సెర్బియా ఆటగాడికి ఆస్ట్రేలియా నుంచి బహిష్కరణ తప్పేటట్లు లేదు. ఈ నేపధ్యంలో జకోవిచ్‌కు సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనే అవకాశం లేదు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనడం కోసం ఈ నెల 5న జకోవిచ్ ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. ఆరోగ్య కారణాలతో వ్యాక్సిన్ వేసుకోకపోయినా జకోవిచ్‌కు టెన్నిస్ ఆస్ట్రేలియా, విక్టోరియా రాష్ట్ర అధికారులు అతనికి అనుమతి ఇచ్చారు. అయితే ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ మంత్రి అలెక్స్ హవక్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని జకోవిచ్ వీసాను రద్దు చేశారు. దీనిపై మెల్బోర్న్ సర్క్యూట్ కోర్టును జకోవిచ్ ఆశ్రయించాడు. అయితే కోర్టు కూడా మంత్రి నిర్ణయాన్నే సమర్ధించింది.