Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : కోవిడ్ లాక్డౌన్ సమయంలో 'వైన్ టైమ్ ఫ్రైడేస్' పేరుతో ప్రధాని కార్యాలయ సిబ్బంది డౌనింగ్ స్ట్రీట్ నడిబొడ్డున పార్టీలు జరుపుకున్నారనే చిత్రాలు వెలుగుచూడ్డంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా కోసం దేశంలోని ప్రధాన ప్రతిపక్షం ఒత్తిడి తీసుకుని వస్తోంది.'పార్టీగేట్'గా పిలుస్తున్న ఈ కుంభకోణం బయటకు వచ్చిన తరువాత బోరిస్‌కు దేశాన్ని నడిపించే అర్హత లేదని, బోరిస్ నేరస్తుడని ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత కెయిర్ స్టర్మెర్ విమర్శించారు. అలాగే, 'ది టైమ్స్' నిర్వహించిన సర్వేలో జాన్సన్ నిజాయితీగా లేడని 10 మంది బ్రిటీషర్లలో ఏడు మంది చెప్పినట్లు వెల్లడయింది. పార్టీలో మద్యం సీసాల కోసం స్థానిక సూపర్ మార్కెట్‌ను డౌనింగ్ స్ట్రీమ్ సిబ్బంది శుక్రవారం రావడంతో వీటిని 'వైన్ -టైమ్ ఫ్రైడేస్'గా పిలుస్తున్నారు.