Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నుకులోఫాలో: మరోసారి సునామీ ముప్పు పొంచిఉన్నదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ పసిఫిక్ సముద్రంలోని ద్వీపకల్పం టోంగా సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్దలైంది. టోంగా రాజధాని నుకులోఫాలోకి 65కి.మీ దూరంలో సముద్ర గర్భంలో ఉన్న అగ్ని పర్వతం(టోంగా హుంగా హాపై) శనివారం ఒక్కసారిగా బద్ధలైంది. టోంగా వ్యాప్తంగా పొగ, బూడిద ఎగిసిపడ్డాయి. సముద్ర గర్భం నుంచి బయటకొచ్చిన బూడిద 20కి.మీ వరకు ఎగిసిపడ్డట్టు టోంగా జియోలాజికల్ సర్వే సంస్థ తెలిపింది. అగ్నిపర్వతం పేలుడు శబ్దాలు సుమారు ఎనిమిది నిమిషాలపాటు వినిపించినట్టు పేర్కొంది. మరోవైపు పేలుడు ధాటికి సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో టోం గాతోపాటు జపాన్, ఫిజీ, హవాయి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, చిలీ, అలస్కాసహా యూఎస్ పశ్చిమ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాకు కూడా అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు చేసింది. తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించింది. అగ్నిపర్వత విస్ఫోటనం.. భూకంప తీవ్రతతో పోలిస్తే రిక్టర్ స్కేలుపై 5.8గా ఉంటుందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. విస్ఫోటనం ధాటికి జపాన్ పసిఫిక్ కోస్టల్ ప్రాంతంలో అలలు 1.2 మీటర్ల ఎత్తు ఎగిసిపడ్డాయని అక్కడి వాతావారణ శాఖ తెలిపింది. టోంగాకు 2,300 కి.మీ దూరంలో ఉన్న న్యూజిలాండ్‌పై కూడా దీని ప్రభావం పడింది. అలలకు అక్కడి తీర ప్రాంతంలో ఉన్న పడవలు ధ్వంసమయ్యాయి. అప్రమత్తమైన అక్కడి అధికారులు తీరప్రాంతంలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.