Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్రెయిన్‌కు సరిహద్దుల్లో బలగాల మోహరింపుపై రష్యా
మాస్కో : నాటోతో వున్న ఉద్రిక్తతల కారణంగానే ఉక్రెయిన్‌కు సరిహద్దుల్లో తమ భూభాగంలో బలగాలను మోహరించనున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఆదివారం తెలిపారు. అక్కడ వాతావరణమేమీ స్నేహపూర్వకంగా లేదని, పైగా చాలా ఉద్రిక్తభరితంగా వుందని, అందువల్లే బలగాలను మోహరించడం అవసరమని భావించినట్లు సిఎన్‌ఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రష్యా సరిహద్దుల్లో నాటో బలగాలను పెంచుతోందని, పైగా సైన్యం డ్రిల్స్, తరుచుగా సైనిక, యుద్ధ విమానాలు సరిహద్దుల్లో తిరగడం వంటి చర్యల కారణంగానే రష్యా కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.