Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోల్ సర్వేలో వెల్లడి
బ్రసీలియా : ఈ ఏడాది అక్టోబరులో జరగనున్న బ్రెజిల్ ఎన్నికల్లో అధ్యక్షుడు జేర్ బోల్సనారో కన్నా మాజీ అధ్యక్షుడు లూలా డసిల్వా 20 పాయింట్లు ముందంజలో వున్నారని కొత్తగా విడుదల చేసిన పోల్ సర్వేలో వెల్లడైంది. లూలాకు ఓటు వేయాలని 44శాతం మంది భావిస్తుండగా, బోల్సనారోకి అనుకూలంగా కేవలం 24శాతం మందే వున్నారని సర్వే పేర్కొంది. డిసెంబరులో ఇదే కంపెనీ నిర్వహించిన చివరి పోల్లో కూడా ఇదే రీతిన పర్సంటేజీ పాయింట్లు వచ్చాయి. అధ్యక్ష బరిలోని మిగిలిన అభ్యర్ధులు సెర్గియో మోరో (9శాతం), సిరో గోమ్స్(7శాతం), జోయో డోరియా(2శాతం) తో చాలా వెనుకబడి వున్నారు.