Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలమైన ఈదురు గాలులు, మంచుతో ప్రజల ఇక్కట్లు
- చీకట్లో మగ్గిన లక్షలాదిమంది
అట్లాంటా : అమెరికాలోని ఆగేయ ప్రాంతంలో పలు చోట్ల ఆదివారం టోర్నడో బీభత్సాన్ని సృష్టించింది. అసలే శీతాకాలం...అందులో బలమైన ఈదురు గాలులు, మంచుతో కూడి ప్రమాదకరమైన రీతిలో తుపాను సంభవించడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. తుపాను కారణంగా విద్యుత్ తీగలు తెగిపడి అంథకారం అలముకుంది. వృక్షాలు సైతం నేలకొరిగాయి. కూలిన చెట్లు, మంచుతో రహదారులు ప్రమాదకరంగా మారాయి. జార్జియా, నార్త్ కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడాల్లో లక్షలాదిమంది ప్రజలు అంథకారంలో మగ్గిపోయారు. వందలాది వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయని హైవే గస్తీ బృందాలు తెలిపాయి.ఫ్లోరిడాలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఆదివారం1200కి పైగా విమానాలు రద్దయ్యాయి. నార్త్ కరోలినాలోని పశ్చిమ ప్రాంతంలో కొన్ని చోట్ల పది అంగుళాల మందాన మంచు పేరుకు పోయింది.ఆదివారం మధ్యాహ్నానికి దాదాపు 300 కార్లు క్రాష్ అయ్యాయ ని సమాచారం వచ్చినట్లు హైవే గస్తీ బృంద ప్రతినిధి తెలిపారు. కార్ల సర్వీస్ కోసం దాదాపు 800 కాల్స్ వచ్చాయన్నారు. రాలేగ్లో కారు దూసు కళ్ళి చెట్లను ఢకొీనడంతో ఇద్దరు మరణించారు. ఆదివారం తెల్లవారు జాము సమయానికి దాదాపు రెండున్నర లక్షల మంది అంథకారంలో వుండగా,రాత్రి సమయానికి కొన్ని చోట్ల పునరుద్ధరించగలిగారు. అయినా మరో లక్షా 30వేల మంది ఇంకా చీకట్లోనే వున్నారు. నార్త్ కరోలినా ప్రాంతం బాగా దెబ్బతింది. దాదాపు 90వేల ఇళ్ళకు విద్యుత్ లేదు. ఫ్లోరిడా కు వాయవ్య ప్రాంతాల్లో గంటకు 190కిలోమీటర్ల వేగంతో గాలులు భయంకరంగా వీస్తున్నాయని జాతీయ వాతావరణ విభాగం తెలిపింది.