Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సియోల్ : ఉత్తర కొరియా రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను తూర్పు జలాల్లోకి ప్రయోగించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (జెసిఎస్) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రెండు వారాల వ్యవధిలోనే ఇప్పటివరకు నాలుగు క్షిపణులను ప్రయోగించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.50గంటల సమయంలో ప్యాంగాంగ్లోని సునన్ వైమానిక క్షేత్రం నుండి తూర్పు తీరం వైపునకు రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు సైన్యం కనుగొందని జెసిఎన్ తెలిపింది. 42కిలోమీటర్ల ఎత్తులో దాదాపు 380కిలోమీటర్ల దూరం ఈ క్షిపణులు ప్రయాణించాయి. దక్షిణ కొరియా, అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు ఈ సమాచారానిన్న విశ్లేషిస్తున్నారు. మొత్తంగా పరిస్థితిని తమ సైన్యం నిశితంగా పరిశీలిస్తోందని జెసిఎస్ తెలిపింది. ఈ నెల 5, 11 తేదీల్లో రెండు వ్యూహాత్మక మార్గనిర్దేశక క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించిందని ఉత్తర కొరియా వార్తా సంస్థ తెలిపింది. ఈనేపథ్యంలో దక్షిణ కొరియా అధ్యక్ష భవన జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్సి) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కొరియా ద్వీపకల్పంలో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు గానూ చర్చలు పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది.