Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆక్రమిత ప్రాంతంలో మరో 1465 ఇండ్ల నిర్మాణం
జెరూసలేం : ఆక్రమిత తూర్పు జెరూసలేంలో తన గృహనిర్మాణ ప్రణాళికతో ఇజ్రాయిల్ మరింత ముందుకెళుతోంది. కొత్తగా 1465 ఇండ్లను నిర్మించాలని ఇజ్రాయిల్ భావిస్తోందని సోమవారం ఎన్జీఓ పీస్ నౌ పేర్కొంది. ఆక్రమిత ప్రాంతంలో ఇజ్రాయిల్ ఇలా ముందుకు చొచ్చుకురావడాన్ని ఆ సంస్థ తీవ్రంగా నిరసించింది. ఈ ప్రణాళికలు జెరూసలేం సుస్థిరతను, శాంతి అవకాశాలను దెబ్బ తీస్తాయని పీస్ నౌ పేర్కొంది. పైగా రెండు దేశాల ఏర్పాటు అవకాశాలకు అత్యంత ప్రమాదకారిగా పరిణమిస్తుందని పేర్కొంది. హర్ హోమా ప్రాంతాన్ని గివట్ హమటోస్తో కలిపేందుకు ఈ కొత్త ప్రణాళిక ఉద్దేశించబడిందని పేర్కొంది. దీంతో ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంత వలయం పూర్తవుతుందని, దీనివల్ల తూర్పు జెరూసలేం, బెత్లెహామ్ మధ్య గల పాలస్తీనా ఇరుగు పొరుగు ప్రాంతాల అనుసంథాన క్రమం దెబ్బ తింటుందని పీస్ నౌ పేర్కొంది. ప్రస్తుతం తూర్పు జెరూసలేంలో దాదాపు 3లక్షల మంది పాలస్తీనియన్లు వున్నారు. వీరు నిరంతరంగా తరలింపులు, ఇండ్ల కూలగొట్టడాలు, స్థానభ్రంశం వంటి సమస్యలను ఎదుర్కొంటూనే వున్నారు. ఈ చర్యల ద్వారా పాలస్తీనియన్లను ఆ ప్రాంతం నుంచి వెళ్లగొట్టాలన్నది ఇజ్రాయిల్ అభిమతంగా వుంది.