Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా : అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఏటీ అండ్ టీ వెరైజెన్ టెలికాం సంస్థలు 5జీ సేవలను ప్రారంభించాయి. అమెరికాలో బుధవారం నుంచి 5జీ సేవలు ప్రారంభించనున్నట్లు తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా పలు విమానాయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. అమెరికాకు వెళ్లాల్సిన పలు విమానాలను రీషెడ్యూల్ చేశాయి. భారత్లోని ఎయిర్ ఇండియా సైతం అగ్రరాజ్యానికి వెళ్లాల్సిన కొన్ని విమానాలను నడపలేకపోతున్నామని ట్విటర్ వేదికగా ప్రకటించింది. 3.7- 3.98 గిగాహెర్ట్జ్ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 5జీ సేవల నిర్వహణకు గతేడాది ఫిబ్రవరిలో వెరైజన్, ఏటీ అండ్ టీ రూ.లక్షల కోట్ల విలువైన ఆర్డరు దక్కించుకున్నాయి. అమెరికాలో 5జీ సేవలు 2021 డిసెంబరు 5 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా సాధ్యపడలేదు.