Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జకర్తా : ఇండోనేషియాలో రాజధానికి మార్పుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న జకర్తా నుంచి నుసంతరకు రాజధానిని మార్చనున్నారు. ఇండోనేషియా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నుసంతరను ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రారంభ తరలింపు ఈ ఏడాది - 2024 మధ్య ప్రారంభమవుతుంది. రాబోయే దశాబ్ధంలో ప్రభుత్వ కేంద్రాన్ని మారుస్తారు. 2045 నాటికి 'అందరికీ ప్రపంచ నగరం' అనే ప్రభుత్వ విజన్ పూర్తవుతుంది. ఇండోనేషియా పార్లమెంట్ రాజధాని మార్పు చట్టాన్ని ఆమోదించడంతో దేశ నాయకులు కొన్ని ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాల్లో గొప్ప పురోగతి సాధించనట్లుగా భావించవచ్చు.