Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబయి : గల్ఫ్దేశాన్ని లక్ష్యంగా చేసుకున్న రెండు హౌతి బాలిస్టిక్ క్షిపణులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అడ్డుకోవడమే కాకుండా ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ సోమవారం తెలిపింది. ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం కలుగ లేదని పేర్కొంది. ఆరేళ్లకు పైబడి.. సౌదీ నేతత్వంలోని సంకీర్ణంతో హౌతీలు యుద్ధం చేస్తున్నారు. సౌదీపై పదేపదే సీమాంతర, డ్రోన్లు దాడులకు పాల్పడుతున్నారు. జనవరి 17 నుండి తిరిగి ఈ దాడులు ప్రారంభించారు. కాగా, యుఎఇపై గత వారం నుండి జరిగిన రెండో దాడి ఇది. ధ్వంసం చేసిన బాలిస్టిక్ క్షిపణుల అవశేషాలు అబుదాబి చుట్టూ ఉన్న ప్రత్యేక ప్రాంతాల్లో పడిపోయాయని మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. అన్ని దాడులకు వ్యతిరేకంగా అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. కాగా, గత వారం జరిగిన దాడిలో అబుదాబిలోని ఇంధన డిపోను తాకడతో ముగ్గురు వ్యక్తులు మరణించారు.