Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19 మంది మృతి
జకార్త : ఇండోనేషియాలోని నైట్ క్లబ్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 19 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 11 గంటలకు ఈ ఘటన జరిగింది. వెస్ట్ పాపువా ప్రావిన్స్‌లోని సోరాంగ్ పట్టణంలోని ఉన్న నైట్ క్లబ్లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగింది. హింసాకాండ అనంతరం మంటలు చెలరేగడంతో ఎక్కువ మంది మరణించారని పోలీసులు వెల్లడించారు. శనివారం ఘర్షణ జరిగిందని.. సోమవారం రాత్రి మరోసారి ఆ గ్రూపుల మధ్య వివాదం తలెత్తిందని సోరోంగ్ పోలీస్ చీఫ్ ఆరీ న్యోటో సెటియావాన్ చెప్పారు. క్లబ్ మొదటి అంతస్తు కాలిపోయిందని, వీలైనంత ఎక్కువ మందిని క్లబ్ నుండి తరలించేందుకు యత్నించామని అన్నారు. అయితే ఈ ఉదయం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో 18 మతదేహాలను కనుగొన్నామని సోరోంగ్ పోలీసు ఆరోగ్య విభాగం హెడ్ ఎడ్వర్డ్ పంజైతాన్ తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టామని అన్నారు.