Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : కరోనా వైరస్, దాన్నుండి పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు సృష్టిస్తున్న కల్లోలం నుంచి ప్రపంచం ఇంకా తేరుకోక ముందే మరో కొత్త వైరస్ బయటపడింది. శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ కొత్త వైరస్ పేరు నియోకోవ్. ఇది మెర్స్ కరోనా వైరస్‌కు చెందినది, అంతే తప్ప సార్స్ కోవ్-2 కి సంబంధించినది కాదని అంటున్నారు. దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో దీన్ని మొదటగా కనుగొన్నట్లు వుహాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఈ వైరస్ వల్ల మానవులకు కలిగే ముప్పుపై మరింత అధ్యయనం జరగాల్సి వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఒమిక్రాన్ మాదిరిగా ఈ వైరస్ వేగంగా ఇతరులకు సంక్రమించడమే కాకుండా మరణాల ముప్పు కూడా ఎక్కువగానే వుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మృత్యువాత పడతారని అన్నారు. అయితే ఇంకా దీనిపై కూలంకషంగా అధ్యయనం జరగాల్సి వుందని చైనా పరిశోధకులు తెలిపారు. మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) కరోనా వైరస్ 2012లో తొలిసారిగా సౌదీ అరేబియాలో గుర్తించారు. ఇది జంతువుల నుండి మనుష్యులకు సంక్రమిస్తుంది. ఇది సోకిన వారిలో 35శాతం మంది మరణించారని డబ్ల్యుహెచ్ఓ డేటా పేర్కొంటోంది. ఆ కేటగిరీకే చెందిన ఈ కొత్త వైరస్ ప్రస్తుతం జంతువుల నుండి జంతువులకే వ్యాప్తి చెందుతోందని అయితే ఇందులో మ్యుటేషన్ కారణంగా ఇది మనుష్యులకు కూడా పాకే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. అదే గనుక జరిగితే మరణాల రేటు కూడా అధికంగా వుంటుందని హెచ్చరిస్తున్నారు.