Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్రెయిన్ సరిహద్దు కాపాడతారా? : ట్రంప్ ఎద్దేవా
వాషింగ్టన్ : మెక్సికోతో సరిహద్దును కాపాడలేనివారు, ఉక్రెయిన్ సరిహద్దును కాపాడతారా అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బైడెన్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. టెక్సాస్‌లోని కోన్రీలో శనివారం 'సేవ్ అమెరికా' ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ, ఇతరదేశాలపై దండయాత్ర గురించి మాట్లాడే ముందు అమెరికా సరిహద్దులకు భద్రత గురించి పట్టించుకోండి అని అన్నారు. మెక్సికోతో తన సొంత సరిహద్దును కాపాడుకోవడం గురించి పట్టించుకోకుండా ఉక్రెయిన్ బోర్డర్‌ను కాపాడడం గురించి బైడెన్ ప్రభుత్వం ఎందుకింత హైరానా పడుతుందని ట్రంప్ ప్రశ్నించారు. శ్వేత సౌధంలో ఎవరిని కదిపినా ఉక్రెయిన్ సరిహద్దును రక్షించడమెలా అన్నదాని గురించే మాట్లాడుతున్నారు. ప్రపంచంలో అంతకంటే ముఖ్యమైన సరిహద్దు ఇప్పుడు మనకి ఉక్రెయిన్బోర్డర్ కాదు, అమెరికా సరిహద్దు'' అని ట్రంప్ పేర్కొన్నారు.