Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాన్, జి4 ప్లస్ దేశాల నిర్ణయం
టెహరాన్ : ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేయడానికి, ఇరాన్ అణు ఒప్పందాన్ని పరిపుష్టం చేయడానికి ఉద్దేశించిన వియన్నా చర్చలకు వారం రోజుల పాటు విరామం ఇవ్వాలని ఈ చర్చల్లో ఇరాన్‌తో పాటు జి4 ప్లస్ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, జర్మనీ పాల్గొంటున్నాయి. కీలకమైన అంశాలపై స్వదేశంలో చర్చల నిమిత్తం ఈ దేశాల ప్రతినిధి బృందాలు వారి దేశాలకు బయలుదేరుతున్నాయని ఇరాన్ వార్తా సంస్థ తెలిపింది. అపరిష్కృతమైన అంశాలకు గల ప్రాధాన్యత దృష్ట్యా వాటిపై చర్చించేందుకే ఈ విరామం తీసుకుంటున్నట్లు ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది. వాస్తవానికి, స్వదేశాల్లో చర్చలు ముగించుకుని ఇక్కడకు వచ్చిన తర్వాత అవసరమైన నిర్ణయాలు తీసుకోగలిగితేనే ఒప్పందం దిశగా అడుగేయడం సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరమున్నందునే చర్చలకు విరామం ఇచ్చినట్లు యురోపియన్ యూనియన్ విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎన్రిక్ మోరో తెలిపారు. వియన్నాలో ప్రాథమిక చర్చలు సానుకూలంగానే జరిగాయని ఇరాన్ వ్యాఖ్యానించింది. సుస్థిర, విశ్వసనీయమైన ఒప్పందం సాధించేందుకు పశ్చిమ దేశాలు కృత నిశ్చయంతో వ్యవహరించాలని పేర్కొంది. ఇరాన్‌తో చర్చలు తుది దశకు చేరుకున్నాయని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వ్యాఖ్యానించాయి. ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేతకు సంబంధించి ఇరాన్ ప్రయోజనాలు పూర్తిగా నెరవేరాలని, అందుకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు వెలువడాలని ఇరాన్ విదేశాంగ మంత్రి హౌసెన్ అమిర్ అబ్దుల్లాహిన్ వ్యాఖ్యానించారు.