Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సియోల్ : తూర్పు సముద్రం దిశగా గుర్తు తెలియని క్షిపణిని ఉత్తర కొరియా (డిపిఆర్కె) ప్రయోగించిందని దక్షిణ కొరియా చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (జెసిఎస్) ఆదివారం తెలిపింది. ఈ ప్రయోగానికి సంబంధించి జెసిఎస్ అంతకుమించి వివరాలను తెలియజేయలేదు. జనవరి మాసంలో ఆరు క్షిపణి ప్రయోగాలు నిర్వహించినట్లు డిపిఆర్కె ప్రకటించింది. వీటిలో రెండు హైపర్సోనిక్ క్షిపణులు వున్నారు. వీటిని జనవరి 5, 11 తేదీల్లో పరీక్షించింది. మరో రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను జనవరి 14న ప్రయోగించగా, రెండు వ్యూహాత్మక క్షిపణులను జనవరి 17న ప్రయోగించించినట్లు తెలిపింది. గత మంగళవారం దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణిని పరీక్షించగా, గురువారం ఉపరితల వ్యూహాత్మక క్షిపణిని ప్రయోగించింది.