Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ కీలక నిర్ణయం
- ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్ మూసివేత
న్యూయార్క్ : అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాన్ వణికిస్తున్నది. హిమపాతం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలను, విద్యా సంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. మంచు తుఫాన్ మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. రోజంతా మంచు కురుస్తుండటంతో పలు ప్రాంతాలలో 30 సెంటీమీటర్లకు పైగా మంచు పేరుకుపోయింది. మాన్ హాటన్కు సమీపంలోని లాంగ్ ఐలాండ్లో 25 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయినట్టు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియాలో మంచు దట్టంగా గుట్టలుగా పేరుకుపోయింది. ఎటుచూసినా హిమపాతమే కనిపిస్తోంది. రోడ్లన్నిటినీ మంచు కప్పేసింది. మంచు తుఫాన్ భారీగా కురుస్తుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. మంచు తుఫాన్ కారణంగా... ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. దీంతో ప్రజల సంక్షేమం కోసం అమెరికా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంచు తుఫాన్ వేళ.. ప్రభుత్వ కార్యాలయాలను, విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఇదిలా ఉండగా... మంచు తుఫాన్ ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్టు విమానయాన సంస్థలు ప్రకటన చేశాయి. దీంతో సుమారు 4 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి.