Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడి
వాషింగ్టన్: అమెరికా జరిపిన మెరుపు దాడిలో ఐఎస్ కీలక నేత అబూ ఇబ్రహీం అల్-హషిమి అల్-ఖురేషీ హతమైనట్టు అమెరికా వెల్లడించింది. వాయువ్య సిరియాలో చేపట్టిన ఉగ్రవాద నిరోధక ప్రత్యేక ఆపరేషన్‌ను అమెరికా సైనిక దళాలు విజయవంతంగా పూర్తిచేసినట్టు ప్రకటించింది.ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ట్విటర్లో వెల్లడించారు.'నా ఆదేశాల మేరకు సిరియాలో గతరాత్రి అమెరికా సైనిక దళాలు చేపట్టిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. మా సాయుధ దళాల నైపుణ్యం, తెగువకు ధన్యవాదాలు.ఐఎస్ నేత అబూ ఇబ్రహీంను తుదముట్టించాం. ఆ ఆపరేషన్‌ను పూర్తి చేసుకొని అమెరికన్లందరూ సురక్షితంగా తిరిగి వచ్చారు' అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాన్నారు. ఈ ప్రత్యేక ఆపరేషన్ జరుగుతోన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు అక్కడ జాతీయ భద్రతా బందం సభ్యులు స్వయంగా పర్యవేక్షించినట్టు వైట్‌హౌస్ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను ట్విటర్లో షేర్ చేసింది. కాగా 2019 అక్టోబర్ నెలలో అమెరికా చేపట్టిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థాపకుడు అబూ బకర్ అల్-బాగ్దాది హతమయ్యాడు. అనంతరం ఐఎస్ బాధ్యతలను అబూ ఇబ్రహీం చేపట్టారు. తాజాగా అమెరికా జరిపిన దాడిలో ఆయన కూడా అంతమయ్యాడని అమెరికా పేర్కొంది.