Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికాలో నిరుద్యోగిత రేటు స్వల్పంగా 0.1 పర్సంటేజీ పాయింట్లు పెరిగి 4శాతానికి చేరుకున్నట్లు కార్మిక శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబరులో 0.3 పర్సంటేజీ పాయింట్లు తగ్గాయి. 2020 ఏప్రిల్‌తో పోలిస్తే గణనీయంగానే తగ్గినప్పటికీ, కరోనా ముందు నాటి పరిస్థితి 3.5 శాతం కంటే ఎక్కువగా వుంది. 65 లక్షలమంది నిరుద్యోగులు పెరిగారు. వీరిలో కూడా శాశ్వత ఉద్యోగాలను కోల్పోయిన వారి సంఖ్య జనవరిలో 16లక్షలకు తగ్గింది. తాత్కాలికంగా కోల్పోయిన వారి సంఖ్య లక్షా 47వేలు పెరిగి మొత్తంగా 9,59,000కి చేరిందని నివేదిక పేర్కొంది. వైట్‌హౌస్ ఆర్థిక సలహాదారుల మండలి మాజీ చైర్మన్, హార్వర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జాసన్ ఫర్మన్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ, ఉపాధి డేటాపై ఒమిక్రాన్ ప్రభావం కనపడేందుకు కొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత గణాంకాల వల్ల రాబోయే ఒకటి రెండు నెలల్లో ఆర్థిక వ్యవస్థ ఎలా వుంటుందనేది ఇప్పుడే చెప్పడం కష్టమని అన్నారు. జనవరిలో విశ్రాంత, ఆతిధ్య రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయి, వృత్తిపరమైన, వాణిజ్యపరమైన సేవా రంగాల్లో, రిటైల్ వాణిజ్యంలో, రవాణా, గోదాముల రంగాల్లో కూడా స్వల్పంగా అవకాశాలు మెరుగయ్యాయని ఆ నివేదిక పేర్కొంది.