Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికన్ ఫోర్డ్ కంపెనీ నిర్ణయం
చికాగో: అమెరికాకు చెందిన ప్రధాన కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ అమెరికా, మెక్సికో, కెనడాల్లోని ఎనిమిది ఫ్యాక్టరీల్లో ఉత్పత్తిని తగ్గించివేసింది. వారం రోజుల తరువాత పరిస్థితిని పరిశీలించి ఉత్పత్తిని తిరిగి పెంచాలా, వద్దా అనేది నిర్ణయిస్తామని ఆ కంపెనీ ప్రతినిధి తెలిపారు. మిచిగాన్, చికాగో, కౌటిట్లాన్లలో ఫ్యాక్టరీల్లో పని నిలిపివేసినట్లు ఫోర్డ్ ప్రతినిధి చెప్పారు. డియర్బార్న్ కెంటకీ, లూయిస్ విల్లీ నగరాల్లోని ఫ్యాక్టరీల్లోనూ 2022 మొదటి అర్ధ భాగంలో కార్ల ఉత్పత్తిని తయారీ తగ్గించేందుకు ఫోర్డ్ ప్రణాళికలు రూపొందించింది.ఈ ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయికి ఉత్పత్తి చేరుకోగలదన్న ఆశాభావాన్ని ఆ కంపెనీ ప్రతినిధి వ్యక్తం చేశారు.