Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లండన్ వీధుల్లో వేలాదిమందితో ర్యాలీ
లండన్ : జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోతుండడంతో బ్రిటన్ ప్రజల్లో ఆగ్రహం రగుల్కొంది. మెరుగైన ఉపాధి, జీవన ప్రమాణాలు కావాలంటూ సెంట్రల్ లండన్లో వేలాదిమంది ప్రదర్శన నిర్వహించారు. ఇతర ప్రాంతాల్లో కూడా వేలాదిమంది కార్మికులు, ప్రజలు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చారు. లండన్, మాంచెస్టర్, బ్రైటన్, బ్రిస్టల్, గ్లాస్గో, కార్డిఫ్లతో సహా దేశవ్యాప్తంగా 30 పట్టణాలు, నగరాల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. పీపుల్స్ అసెంబ్లీ అగైనెస్ట్ ఆస్టిరిటీ సంస్థ ఈ ఆందోళనలకు పిలుపునిచ్చింది. డజన్ల సంఖ్యలో కార్మిక సంఘాలు, ప్రచార గ్రూపులు ఈ నిరసనలకు మద్దతిచ్చాయి, ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యవహార శైలిపై ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి నిరసనల్లో స్పష్టంగా బయటపడింది. వేతనాలు, పెన్షన్లలో కోతలు, పెరుగుతున్న ఇంధన ధరలు, వీటికి తోడు కోవిడ్ సంక్షోభ ప్రభావంతో వేలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. తమ కుటుంబ అవసరాలను కూడా తీర్చలేని స్థితిలో వున్నారు. వినియమ ధరల సూచీ ఇప్పటికే 7.5శాతానికి చేరడంతో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరింది. ఏప్రిల్ 1నుంచి జాతీయ బీమా చెల్లింపులు సహా అన్ని రకాల బిల్లులు పెరుగుతున్నాయి. మరో వైపు మాంచెస్టర్లో కార్మికులు పారిశ్రామిక సమ్మె విజయవంతమైంది. రివల్యూషనరీ సోషలిజం ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ, డిజేబుల్డ్ పీపుల్ అగెనెస్ట్ కట్స్ (డిపిఎసి), ఫ్యూయల్ పావర్టీ యాక్షన్ సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ సమ్మెలో పాల్గొన్నారు. లేబర్ నేత జెర్మీ కార్బిన్తో సహా పలువురు నేతలు నిరసనకారులనుద్దేశించి ప్రసంగించారు. కార్పొరేట్ల దురాశ, మార్కెట్ వైఫల్యం వంటి వాటికి తాము మూల్యం చెల్లించాల్సి వుంటుందని సంపన్నులు చెప్పడంతో ప్రజలు విసిగిపోయారని యునైట్ జనరల్ సెక్రటరీ షారోన్ గ్రాహమ్ అన్నారు. కుటుంబానికి కాస్తంత ఆహారం, ఇతర వసతులు అందించగలిగేలా మెరుగైన వేతనాలు ఇవ్వాలంటూ కార్మికులు పోరాడుతున్నారని అన్నారు. పేదలను పణంగా పెట్టి లాభాలు ఆర్జిస్తున్నారంటూ చమురు, గ్యాస్ దిగ్గజ సంస్థలను లేబర్ ఎంపి రిచర్డ్ బుర్గావ్ విమర్శించారు.