Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్రవాది కాబట్టే దాడి చేశామంటున్న ఇజ్రాయిల్
జెరూసలెం : వెస్ట్ బ్యాంక్లో ఘర్షణల సందర్భంగా 17 ఏళ్ల పాలస్తీనా యువకుడిని ఇజ్రాయిలీ బలగాలు కాల్చి చంపాయి. ఇజ్రాయిల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో జెనిన్ పట్టణానికి సమీపంలో సిలాత్ అల్ హరితియా గ్రామంలో మహ్మద్ అబూ సలాV్ాని కాల్చి చంపారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇజ్రాయిల్ ఈ చర్యను సమర్థించుకునేందుకు చనిపోయిన వ్యక్తిని తీవ్రవాది అన్న ముద్ర వేసింది. వెస్ట్ బ్యాంక్లో యూదు సెటిలర్ను ఇటీవల జరదత్, మరికొంతమంది కలిసి కాల్చి చంపారని ఆర్మీ పేర్కొంది. ఇజ్రాయిల్ తరచుగా పౌరుల ఆవాసాలపై దాడులకు పూనుకుంటోంది.