Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో : శ్రీలంక ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సా మరో 15రోజుల్లో భారత్లో పర్యటించనున్నారు. తీవ్రమైన విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు భారత్ అందించే ఆర్థిక సహాయ ప్యాకేజీని రూపొందించేందుకు ఈ పర్యటన ఉద్దేశించబడిందని విదేశాంగమంత్రి జి.ఎల్.పెరిస్ మంగళవారం తెలిపారు. రెండు మాసాల కాలంలో రాజపక్సా భారత్లో రెండోసారి పర్యటిస్తున్నారు. నిత్యావసరాల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్న శ్రీలంకకు ఆహార దిగుమతులు, విదేశీ నిల్వల పెంపు కోసం 90కోట్ల డాలర్ల రుణాన్ని ఇస్తున్నట్లు జనవరిలో భారత్ ప్రకటించింది. డిసెంబరులో రాజపక్సా భారత్ పర్యటన ఫలితంగా 240కోట్ల డాలర్ల సాయం అందిందని పెరిస్ విలేకర్లకు తెలిపారు. డిసెంబరులో ఆయన జరిపిన పర్యటన సందర్భంగా ఆహారం, ఆరోగ్య భద్రత, ఇంధన భద్రత, చెల్లింపుల సమస్యలు వంటి రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై కూలంకషంగా చర్చలు జరిగాయి. శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల పరిష్కారం పట్ల భారత్ జోక్యం సానుకూలంగా వుందని పెరిస్ వ్యాఖ్యానించారు.