Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్వైపాక్షిక వాణిజ్యం పెంపు లక్ష్యం
అబూదాబి : టర్కీ అధ్యక్షుడు తైపీ ఎర్డోగన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటిస్తున్నారు. 2013 తర్వాత జరిగిన మొదటి పర్యటన ఇది. ఆర్థిక భాగస్వామ్యంపై సంవత్సరాల తరబడి నెలకొన్న శతృత్వంతో ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను చక్కదిద్దుకోవడానికి రెండు దేశాలు పర్యటిస్తున్నాయి. అబూదాబి యువరాజు మహ్మద్ బిన్ జావేద్ అల్ నహిన్, ఎర్డోగన్‌కు స్వాగతం పలికారు. గత నవంబరులో అబూదాబి యువరాజు టర్కీలో పర్యటించి కోట్లాదా డాలర్ల విలువచేసే పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అబూదాబికి బయలుదేరడానికి ముందు ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఎర్డోగన్ విలేకర్లతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలను మంచిస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి జరగాలన్నది తమ ఉద్దేశ్యమని చెప్పారు. ఈ ప్రాంత శాంతి సుస్థిరతలకు టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య చర్చలు, సహకారం చాలా కీలకమని వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించుకునేందుకు, ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థల్లోనూ అవకాశాల కోసం తన పర్యటన ఉద్దేశించబడిందన్నారు. దశాబ్ద కాలం క్రితం అరబ్ తిరుగుబాట్లు జరిగినప్పటి నుండి ఈ రెండు దేశాలు ప్రాంతీయ ప్రాబల్యాన్ని పెంచుకునే విషయంలో పోటీపడుతున్నాయి.