Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్రెయిన్‌లో తమ పౌరులకు ఫ్రాన్స్ విజ్ఞప్తి
కీవ్ : ఆహారం, నీరు నిల్వ చేసుకోవాల్సిందిగా ఉక్రెయిన్‌లోని ఫ్రెంచి పౌరులకు ఫ్రాన్స్ విజ్ఞప్తి చేసింది. రాబోయే రోజులు కష్టంగా సాగే అవకాశాలున్నందున ముందు జాగ్రత్త చర్యలు పాటించాలంటూ కీవ్‌లో పారిస్ రాయబారి ఎటినె డె పాన్సిన్స్ కోరారు. గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతల నివారణకు మన అధికారులు అవిశ్రాంతంగా కృషి చేశారని చెప్పారు. ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అన్ని రకాల పర్యటనలను వాయిదా వేసుకోవాల్సిందిగా పర్యాటకులను కోరారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినపుడు అత్యవసరమైన ఆహారం, నీరు, వేడిని కలగచేసే దుస్తులు సిద్ధంగా వుంచుకోవాలన్నారు. పెట్రో ఉత్పత్తులను కూడా సమకూర్చుకోవాలన్నారు. తమ వ్యక్తిగత డాక్యుమెంటన్నింటినీ సక్రమంగా వుంచుకోవాల్సిందిగా సూచించారు. అయితే, ఉక్రెయిన్ వీడి రావాలని తాము సిఫార్సు చేయబోమని చెప్పారు. తమ ఎంబసీ కూడా పనిచేస్తుందన్నారు.