Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత పౌరులకు రాయబార కార్యాలయం సూచన
కీవ్ : ఉక్రెయిన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల దష్ట్యా ఇక్కడ నుంచి భారతీయులు తాత్కాలికంగా తిరిగి స్వదేశానికి వెళ్లాలని రాయబార కార్యాలయం కోరింది. ''ఇక్కడ ఉండాల్సిన అవసరం పెద్దగా లేకపోతే, మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోవచ్చు'' అని దేశంలో భారతీయులకు, ముఖ్యంగా విద్యార్థులకు ఎంబసీ సూచించింది. ఉక్రెయిన్లోనూ అనవసర ప్రయాణాలు కూడా మానుకోవాలని రాయబార కార్యాలయం భారతీయులకు చెప్పింది. ''అవసరమైనప్పుడు మీకు తగిన సహకారం అందించడానికి వీలుగా, మీరున్న పరిస్థితి గురించి ఎంబసీకి సమాచారం అందిస్తుండాలి'' అని చెప్పింది. తమ కార్యాలయం మామూలుగానే పనిచేస్తుందని తెలిపింది. కాగా, ఉక్రెయిన్ సంక్షోభానికి తెరదించడానికి, దౌత్య పరిష్కారాలపై ఇంకా ఆశలు వదులుకోలేదని అమెరికా, బ్రిటన్ నేతలు చెప్పారు. కానీ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని హెచ్చరించారు. మరోవైపు రష్యా సైనిక చర్యలకు దిగవచ్చనే హెచ్చరికలు వస్తున్నప్పటికీ, ఒప్పందం జరగడానికి ఇప్పటికీ అవకాశం ఉందని 40 నిమిషాలపాటు మాట్లాడుకున్న జో బైడెన్, బోరిస్ జాన్సన్ ఏకీభవించారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో లక్ష మందికి పైగా సైనికులను మోహరించిన రష్యా మాత్రం, ఆ దేశం మీద తాము దాడి చేస్తామని వ్యక్తమవుతున్న ఆందోళనలను తోసిపుచ్చుతోంది.