Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలిచిపోయిన ప్రభుత్వ, బ్యాంక్ వెబ్సైట్లు
కీవ్ : ఉక్రెయిన్ ప్రభుత్వ, ప్రధాన బ్యాంకుల వెబ్సైట్లపై మంగళవారం సౖౖెబర్ దాడి జరిగినట్టు డిప్యూటీ మంత్రి విక్టర్ జోరా తెలిపారు. డీడీఓఎస్ దాడుల కారణంగా 10 ప్రభుత్వ వెబ్సైట్లు. పనిచేయడం లేదు. హ్యాకింగ్‌కు గురైన వాటిలో రక్షణ, విదేశాంగ, సాంస్కృతిక శాఖల వెబ్సైట్లతో పాటు రెండు అతిపెద్ద బ్యాంకుల వెబ్సైట్లు కూడా ఉన్నట్లు ఉక్రెయిన్ సమాచార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.. ఉక్రెయిన్ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న అనేక హ్యాకింగ్ ఆపరేషన్స్‌లో ఈ దాడి తాజాది. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకులైన ప్రివత్బ్యాంక్, స్బెర్బ్యాంక్ల్లో వినియోగదారులు ఆన్లైన్ చెల్లింపుల్లో, బ్యాంక్ యాప్‌ల్లో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. అయితే, డిపాజిటర్ల నిధులకు ఎలాంటి ముప్పు లేదని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడి వెనుక రష్యా వుందేమోనన్న అనుమానాన్ని మంత్రిత్వ శాఖ వ్యక్తం చేసింది. అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. జనవరి మధ్యలో ఒకేసారి 70కి పైగా ఉక్రెయిన్ ప్రభుత్వ వెబ్సైట్లు తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోయాయి. ఈ సైబర్ దాడి వెనుక రష్యా వుందంటూ ఆనాడు ఉక్రెయిన్ ఆరోపించింది.