Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒట్టావా : కెనడాలోని క్యూబెక్‌లో ఉన్న మూడు కాలేజీలను ఆకస్మికంగా మూసివేశారు. దీంతో అందులో చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు పెద్ద ఇబ్బందుల్లో పడ్డారు. మాంట్రిరులోని ఎం కాలేజ్, షేర్బ్రూక్లోని సిడిఇ కాలేజ్, లాంగ్యుయిల్లని సిసిఎస్క్యూ కాలేజ్ మూత పడ్డాయి. కాగా, ట్యూషన్ ఫీజుల కోసం గడువును పెంచిన ఈ కాలేజీలు... మూత పడే నెలలో ఆకస్మికంగా ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులకు నోటీసులు జారీ చేశాయి. ఈ మూడు దివాలా దిశగా వెళుతున్నట్లు స్థానిక మీడియా కూడా తెలిపింది. ఈ చర్యతో విస్తుపోయిన విద్యార్థులు.. తమ భవితవ్యమేంటని ఒట్టావాలోని భారతీయ రాయబార కార్యాలయానికి వచ్చి మొరపెట్టుకున్నారు. వీరిలో అనేక మంది ఫీజు కింద వేల డాలర్లు చెల్లించారు. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం శనివారం అప్రమత్తమైంది. బాధిత విద్యార్థులకు సహాయాన్ని అందించడానికి కెనడా ప్రభుత్వం, క్యూబెక్ ప్రావిన్స్ ప్రభుత్వం, కెనడాలోని భారతీయ సంఘం నుండి ఎన్నికైన ప్రతినిధులతో హైకమిషన్ సంప్రదింపులు జరుపుతుందని తెలిపింది.