Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : ఉక్రెయిన్ సంక్షోభంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్లు శిఖరాగ్ర సమావేశం త్వరగా జరగాలని కోరుకుంటున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై అమెరికా, రష్యా అధ్యక్షులు భేటీ కానున్నారని ఫ్రాన్స్ పేర్కొన్న తర్వాత.. ఈ ప్రకటన వెలువడింది. ఈ సదస్సును ఫ్రాన్స్ ప్రతిపాదించగా.. పుతిన్‌తో బైడెన్ భేటీ అయ్యేందుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరిందని తెలిపింది. అయితే బైడెన్‌తో భేటీ కావాలనుకుంటే ఉక్రెయిన్‌పై రష్యా దాడికి పాల్పడకూడదన్న ఒప్పందంపై ఫ్రాన్స్ ఈ సదస్సును ప్రతిపాదించింది. కాగా, దీనిపై క్రెమ్లిన్ ప్రతినిధి మిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ఏ విధమైన శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించడానికి ఏదైనా నిర్థిష్ట ప్రణాళికల గురించి చర్చించడంపై అవగాహన ఉందని అన్నారు. విదేశాంగ మంత్రలు స్థాయిలో చర్చలు కొనసాగించాలన్న అవగాహన తమకుందని అన్నారు. అయితే అధ్యక్ష శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు లేవని అన్నారు. అవసరమైతే.. రష్యా, అమెరికా అధ్యక్షులు చర్చించాలనుకుంటే...టెలిఫోన్ కాల్ లేదా ఇతర పద్ధతులను నిర్వహించవచ్చునని అన్నారు. దేశాధినేతలు సానుకూలంగా స్పందిస్తే సమావేశం సాధ్యమవుతుందని అన్నారు. క్రెమ్లిన్ భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పుతిన్ అధ్యక్షత వహిస్తారని తెలిపారు.