Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : కరోనా అంతం కావొచ్చినా, మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్గేట్స్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వైరస్ కరోనా కుటుంబానికి చెందినది కాదని, వేరే వ్యాధికారక వైరస్ల నుంచి వచ్చే అవకాశముందని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్లు విస్తతంగా అందుబాటులోకి రావడంతో కోవిడ్-19 తీవ్రత తగ్గిందని అన్నారు. 'మరో మహమ్మారి రాబోతుంది. కానీ ఈ సారి రాబోయేది కరోనా కన్నా భిన్నమైంది. ఇది తీవ్రంగా ప్రభావితం చేయొచ్చు. ముఖ్యంగా వద్ధులు, డయోబెటిక్, స్థూలకాయులపై ప్రభావం అధికంగా ఉండవచ్చు' అని అన్నారు. 2022 మధ్య నాటికి ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సిన్లు అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) లక్ష్యాన్ని చేరుకోకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని అన్నారు. ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మెరుగుపర్చడంలో సాంకేతికత మనకు సాయపడుతుందని గేట్స్ తెలిపారు. మెసెంజర్ ఆర్ఎన్ఎ (ఎంఆర్ఎన్ఎ) సాంకేతికతో అది సాధ్యమని అన్నారు.