Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీవ్‌లో కొనసాగుతున్న పోరు
- బెలారస్లో శాంతి చర్చలకు జెలెన్స్కీ ఓకే
- 975 మిలిటరీ వసతులు ధ్వంసం :రష్యా
- పుతిన్ నోట అణు సన్నద్ధత మాట
- జెలెన్స్కీకి ప్రధాని మోడీ ఫోన్
కీవ్/ మాస్కో: రష్యన్ దళాలు ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖర్కివ్‌కు విస్తరించాయి. రాజధాని కీవ్‌పై పట్టు సాధించేందుకు యత్నాలు కొనసాగిస్తూనే ఖర్కివ్‌ను ముట్టడించే దిశగా రష్యన్ దళాలు ముందుకు సాగుతున్నాయి. దీంతో రష్యా, ఉక్రెయిన్ ఘర్షణ కొత్త దశకు చేరుకుంది. అణు సన్నద్ధత గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారి ప్రస్తావించారు. సైనిక చర్య ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు చెందిన 975 మిలిటరీ మౌలిక సదుపాయాలను, పరికరాలను తమ దళాలు ధ్వంసం చేశాయని రష్యా తెలిపింది. ఖర్కివ్‌లో రష్యన్ దళాలకు ఉక్రెయిన్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఘర్షణలు కీవ్, ఖర్కివ్లతో బాటు ఖెర్సాన్ సిటీ, బెర్డియాంక్ , యెడెసా,మయెంకొలానే తదితర ప్రాంతాలకు విస్తరించాయి. రానురాను పరిస్థితి దిగజారుతుండడంతో యుద్ధాన్ని ఆపి, శాంతిని పునరుద్ధరించేందుకు బెలారస్లో చర్చలకు రష్యా చేసిన ప్రతిపాదనపై ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్స్కీ చివరికి అంగీకరించారు. ఖర్కివ్ శివార్లలో గ్యాస్ పైపులైన్ ఆదివారం ఉదయయం పేలిపోయింది. ఇది రష్యా పనేనని ఉక్రెయిన్ ఆరోపించింది.దీనిని రష్యా తోసిపుచ్చింది. మరోవైపు రష్యాపై కత్తిగట్టిన అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ కొన్ని ఎంపిక చేసిన రష్యన్ బ్యాంకులను స్తంభింపజేయాల ని నిర్ణయించాయి. ఉక్రెయిన్‌కు 35 కోట్ల డాలర్ల మేర సైనిక సాయాన్ని అందించనున్నట్లు అమెరికా ఇప్పటికే ప్రకటించింది.బాంబుల వర్షం కురుస్తుండడ ంతో ఉక్రెయిన్ నుంచి లక్షా 50 వేల మంది పోలండ్, మాల్డోవా, ఇతర ఇరుగు పొరుగు దేశాలకు శరణార్థులుగా తరలివెళ్తున్నారు.. రష్యాపై ఆంక్షల్లో భాగంగా రష్యన్ విమానాలను తమ దేశంలో దిగకుండా పశ్చిమ దేశాలు తమ గగనతల మార్గాలను మూసివేశాయి. మరో వైపు రష్యా తమ పట్ల ప్రతికూల వైఖరి తీసుకున్న లిథువేనియా, ఎస్తోనియా, స్లొవేనియా విమానాలను తమ గగన తలంలో ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించింది. ఇదిలావుండగా ఉక్రెయిన్ ప్రధాని భారత్ సాయం కోరిన నాలుగు రోజులకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నాడు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్‌పై భద్రతామం డలిలో తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైన కొద్ది సేపటికే ఈ ఫోన్ సంభాషణ చోటుచేసుకుంది.
బెలారస్లో చర్చలకు ఉక్రెయిన్ ఓకే
చర్చల ప్రక్రియపై ఘడియకొక వైఖరి తీసుకుంటూ ప్రతిష్టంభనకు కారకుడైన అధ్యక్షుడు జెలెన్స్కీ చివరికి దిగొచ్చాడు. బెలారస్లో శాంతి చర్చలకు సిద్ధమేనని ఆదివారం ప్రకటించారు. అంతకుముందు బెలారస్లో తప్ప మరెక్కడైనా చర్చలకు ఉక్రెయిన్ సిద్ధమేనని అన్నారు. దీంతో శాంతి చర్చలను తమ దేశంలో నిర్వహించాలని హంగరీ కోరింది. బెలారస్‌లోని మిన్స్క్, వార్సాల్లో చర్చలకు ఉక్రెయిన్ సిద్ధం కాకపోతే మా దేశానికి రండి అంటూ హంగరీ విదేశాంగ శాఖ మంత్రి పీటర్ సిజార్తో ఫేస్బుక్లో ట్వీట్ చేశారు.
ఈ సందిగ్ధతల మధ్య పుతిన్ ముఖ్య సహాయకుడు, మాజీ మంత్రి వ్లదిమిర్ మెదిన్స్కీ నేతృత్వంలో రష్యన్ ప్రతినిధి బృందం శాంతి చర్చల కోసం బెలారస్ చేరుకుంది. బెలారస్‌ను వేదికగా చేసుకుని రష్యా మాపై క్షిపణులను ప్రయోగిస్తున్నందున అక్కడ చర్చలకు తాము వచ్చేది లేదన్నారు. డాన్‌బాస్క్ నుంచి తరలి వచ్చిన వేలాది మంది శరణార్థులకు రష్యా ఆశ్రయమిచ్చింది. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఫ్రాన్స్ 500 మంది సైనికులను రుమేనియాకు తరలించింది. ఉక్రెయిన్‌కు వ్యూహాత్మక సంఘీభావంగా నాటో తన బలగాలను సమీకరిచే పనిలో ఉన్నట్లు ఫ్రెంచ్ ఆర్మీ జనరల్ తెరీ బుర్ఖార్డ్ను ఉంటకిస్తూ ఫ్రెంచ్ డైలీ 'లే ఫిగరో' పేర్కొంది.
శాంతి పునరుద్ధరణకు సహకరిస్తాం : మోడీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని నరేంద్రమోడీ శనివారం రాత్రి ఫోన్ చేసి రష్యా సైనిక చర్యలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జెలెన్స్కీ ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న ఘర్షణల గురించి ప్రధానికి వివరించారు. హింసను విడనాడి,శాంతిని పునరుద్ధరి ంచేందుకు అన్ని విధాలా సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని మోడీ ఉక్రెయిన్ అధ్యక్షునికి హామీ ఇచ్చారు. పుతిన్‌తో సంభాషణల్లోనూ ప్రధాని ఇదే విషయాన్ని చెప్పారు. ఉక్రెయిన్‌లో వేలాది మంది భారతీయుల భద్రత గురించి భారత్ ఆందోళనను జెలెన్స్కీకి తెలియజేశారు.ఘర్షణలు కొనసాగుతుండ డం వల్ల వారిని ఖాళీ చేయించే ప్రక్రియ క్లిష్లతరంగా మారిందన్నారు. ఫిబ్రవరి 22న ఉక్రెయిన్ ఎంబసీ ద్వారా ప్రధాని మోడీకి జెలెన్స్కీ పంపిన సందేశంలో రష్యా సైనిక చర్యను నివారించేందుకు భారత్ జోక్యం చేసుకోవాలని కోరారు.
ఖర్కివ్ మా అధీనంలోనే ఉంది: ఉక్రెయిన్
పద్నాలుగు లక్షల జనాభా కలిగిన ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరం ఖర్కివ్‌లో వీధి పోరాటాలు ఉధృతరూపం తీసుకున్నా, అది పూర్తిగా తమ అదుపులోనే ఉందని ఉక్రెయిన్ తెలిపింది. ఖర్కివ్ వైపు రష్యన్ యుద్ధ ట్యాంకుులు దూసుకెళ్తున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండడంతో నగర ప్రథమ డిప్యూటీ మేయర్ కోల్ పొవొరోజ్నిక్ ఈ వివరణ ఇచ్చారు.. గ్యాస్ పైపులైన్ పేలిపోయినట్లు ఉక్రెయిన్ అధికారిక వార్తా సంస్థ యుక్రిన్ ఫార్మ్ తెలిపింది. రష్యన్ దళాలు డానిల్ వికా జిల్లా సిటీలో సంభవించిన ఈ పేలుడు వెనక రష్యా హస్తం ఉన్నట్లు డిప్యూటీ మేయర్ తెలిపారు. రాజధాని కీవ్ ప్రభుత్వ బలగాల అదుపులోనే ఉందని కీవ్ సిటీ స్టేట్ పాలనాయంత్రాంగం అంతకుముందు ఒక ప్రకటనలో తెలిపింది.దేశంలో వ్యూహాత్మక రేవు పట్టణాలను, ఇంధన కేంద్రాలను వశపరచుకునేందు కు రష్యా పథకం వేసిందని, ఉక్రెయిన్‌లోని జెలెన్స్కీ ప్రభుత్వాన్ని కూలదోసి, దాని స్థానే రష్యా అనుకూల ప్రభుత్వాన్ని ప్రతిష్టించడమే పుతిన్ లక్ష్యంగా పెట్టుకున్నారని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకుండా నిరోధించేందుకు, రష్యన్లు అధికంగా ఉన్న డాన్బాస్, డాంటెస్క్, లుగానెస్క్ పీపుల్స్ రిపబ్లిక్లను నియో నాజీల బారి నుంచి కాపాడేందుకే సైనిక చర్య చేపట్టామని రష్యా చెబుతోంది.
975 మిలిటరీ సదుపాయాలు ధ్వంసం
ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి ఇంతవరకు 975 మిలిటరీ మౌలిక సదుపాయాలు, పరికరాలను తమ దళాలు ధ్వంసం చేశాయని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి ఇగోర్ కొనషెంకో చెప్పారు.