Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీవ్ : అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రసంగం నిరాశ కలిగించిందని ఉక్రెయిన్ పేర్కొంది. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాను శిక్షించడం గురించి అధ్యక్షుడు బైడెన్ మంగళవారం స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో మాట్లాడారు. రష్యా ప్రభుత్వంపై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తామని మాత్రమే ప్రకటించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా సైనిక బృందాలను మోహరించమని పునరుద్ఘాటించారు. ఈ ప్రసంగంపై ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యులు ఒలెక్సాండ్రా ఉత్సినోవా స్పందించారు. బైడెన్ ప్రసంగాన్ని ఉక్రెయిన్ మొత్తం చూసిందని, వాస్తవంగా చెప్పాలంటే .. ఆయన ప్రసంగం పూర్తిగా మాకు నిరాశ కలిగించిందని అన్నారు. 1991లో సోవియట్ యూనియన్ పతనం అనంతరం ఉక్రెయిన్ తన అణ్వాయుధాలను వదులుకుందని, ఆ సమయంలో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు రక్షణను అందిస్తామన్న ప్రతిజ్ఞ చేశాయని.. కానీ నెరవేర్చడంలో విఫలమయ్యాయని అన్నారు. రష్యాపై ఆంక్షలతో, పశ్చిమ దేశాల సైనిక సహాయంతో ఉక్రెనియన్ పౌరుల ప్రాణాలు రక్షించబడటం లేదని ఉత్సినోవా ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా దాడి నుండి నాటో పోలాండ్, బాల్టిక్ దేశాలను కాపాడుతుందని తాను భావించడం లేదని అన్నారు.