Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెనీవా : ప్రపంచవ్యాప్తంగా మంగళవారం నాటికి 44 కోట్లకు మందికి పైగా కరోనా బారీన పడగా, 60 లక్షలకు పైగా మంది ఈ వైరస్‌తో మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాలు ప్రకారం కరోనా వైరస్ ప్రారంభమైన దగ్గర నుంచి మంగళవారం సాయంత్రం వరకూ 44,65,11,318 మందికి కరోనా నిర్ధారణ కాగా, వీరిలో 60,04,421 మంది మరణించారు. కేసులు, మరణాలు రెండింటిలోనూ అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 7 కోట్లకు పైగా కేసులు నిర్ధారణ కాగా, 9,51,348 మంది కరోనాతో మరణించారు. భారత్‌లో 4.20 కోట్ల మందికిపైగా కరోనా బారీన పడగా, 5.15 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. బ్రెజిల్లో సుమారు 3 కోట్ల మంది వైరస్ బారీన పడగా, 6.52 లక్షల మంది మరణించారు. అమెరికా దేశాల్లో 14 కోట్లకు పైగా కేసులు, 26 లక్షలకు పైగా మరణాలు సంభవించాగా, యూ రప్ దేశాల్లో 18 కోట్లకు పైగా కేసులు, 18 లక్షలకు పైగా మరణాలు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.