Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్రెయిన్ సంక్షోభంపై థాయి అధికారి వ్యాఖ్య
బ్యాంకాక్ : ఆంక్షలు తరచూ పనిచేయవు, కొన్ని సార్లు వినాశకరమైన ప్రభావాలకు కూడా కారణమవుతుంటాయని పేర్కొంటూ, ఉక్రెయిన్ సంక్షోభానికి చర్చలు జరపడమొక్కటే పరిష్కార మార్గమని థాయి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆంక్షలు ముఖ్యంగా ఆర్థిక ఆంక్షలనేవి పరిష్కారం చూపకపోగా, లక్ష్యంగా పెట్టుకున్న దేశాల ప్రజలను తీవ్రంగా బాధిస్తాయని థాయి ప్రధాని భద్రతా సలహా కమిటీ ఛైర్మన్ పనితం వత్తనారుగార్న్ పేర్కొన్నారు. రష్యాపై పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలను ఆయన ప్రస్తావించారు. చర్చలు జరిపేలా ఒత్తిడి తీసుకురావడం కోసం తరచుగా ఉపయోగించే సాధనాల్లో ఆంక్షలు ఒకటిగా వున్నట్లు కనిపిస్తోంది, కానీ ఈ కొత్త శకంలో, మనందరం గ్లోబల్ మార్కెట్‌తో అనుసంథానమై వున్నాం. ఒక దేశంపై ఆంక్షలు విధించినా, మరెన్న దేశాలు ఇబ్బందులు పడతాయి. చివరకు ఆంక్షలు విధించిన దేశం కూడా దీనివల్ల ఇబ్బంది పడుతుందని ఆయన ఇటీవల జిన్హువాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంధనం, పరిశ్రమలు, ప్రయాణ, వ్యవసాయ ఉత్పత్తులు తదితరాలపై రష్యాతో పరస్పరం ఆధారపడి వున్నందున ఈ యుద్ధం వల్ల యురోపియన్ దేశాలు ఎక్కువగా ఇబ్బందులు పడతాయని అన్నారు. ఇంధన సరఫరాలకు అధిక ధరలు చెల్లించడంతో సహా ప్రత్యామ్నాయ సరఫరాల కోసం చూస్తున్నారని అన్నారు. మధ్యప్రాచ్యంలో మాదిరిగా సుదీర్ఘంగా కొనసాగే ఘర్షణల్లా కాకుండా ఉక్రెయిన్ ఘర్షణ త్వరగా ముగిసిపోవాలని, ఇందుకోసం శాంతియుత పరిష్కారాలను అన్వేషించాలని ఆయన ఆకాంక్షించారు.