Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : రష్యాపై అమెరికా విధిస్తున్న ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తన కరెన్సీ నోట్లపై నిషేధం విధించింది. డాలర్ విలువ కలిగిన బ్యాంకు నోట్లను రష్యా ప్రభుత్వానికి లేదా రష్యాలో జీవిస్తున్న ఏ వ్యక్తికైనా ఎగుమతి చేయడం, విక్రయించడం లేదా సరఫరా చేయడం వంటి చేయరాదని అమెరికా ఆదేశాలిచ్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాపై ఆంక్షలు విధిస్తున్న అమెరికా.. ఆర్థికపరమైన ఒత్తిడిని తెస్తోంది. ఈ కరెన్సీపై ఆంక్షలతో రష్యా తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. రష్యా చేసుకున్న చమురు ఒప్పందాలన్నీ అమెరికా కరెన్సీతో ముడిపడి ఉన్నందున... ఇప్పుడు ఆ దేశానికి ఆర్థిక పరమైన సమస్యలు ఎదురుకావచ్చు.అటు యూరోపియన్ యూనియన్ సైతం రష్యాపై యూరో నోట్ల ఎగుమతి,దిగుమతిని నిషేధించింది.