Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోస్తున్న అమెరికా
- ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధాలందజేత
- దౌత్య యత్నాలు ముమ్మరం చేసిన యూరప్
- కీవ్ నుంచి పోలండ్‌కు భారత ఎంబసీ తరలింపు
కీవ్ : పోలండ్ సరిహద్దుకు సమీపంలోని ఉక్రెయిన్ మిలిటరీ స్థావరంపై రష్యన్ వైమానిక దళం క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగడంతో రష్యా, ఉక్రెయిన్ ఘర్షణలు పద్దెనిమిదో రోజు ఆదివారం మరింత ఉధృతరూపం దాల్చాయి. తాజా దాడుల్లో 35 మంది దాకా మరణించినట్లు ఉక్రెయిన్ తెలిపింది. పోలండ్త సరిహద్దుకు 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్ సైనిక శిక్షణా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణులతో దాడి చేసింది. ఉక్రెయిన్ సైనికుల కోసం ఉద్దేశించిన విదేశీ ఆయుధ సరఫరాలపై దాడులు చేస్తామని రష్యా ప్రకటించిన మరుసటి రోజే ఈ మిలిటరీ స్థావరంపై దాడి జరిగింది. ఈ దాడిలో అమెరికా జర్నలిస్టు కూడా ఒకరు మరణిం చినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. అంతర్జాతీయ శాంతి పరిరక్షక దళానికి ఉద్దేశించిన కేంద్రాన్ని ఉక్రెయిన్ మిలిటరీ సిబ్బంది చాలా కాలంగా తమ స్థావరంగా ఉపయోగించు కుంటోంది. అమెరికా, నాటో దేశాలు సహకారంతోనే ఉక్రెయిన్ సైనిక స్థావరంగానే కాకుండా, అంత ర్జాతీయ నాటో సైనిక విన్యాసాలకు కూడా వాడుకుంటున్నదని రష్యా ఆరోపించింది. 30 దేశాలతో కూడిన నాటో కూటమి ఱస్యాతో సరిహద్దు కలిగిన తన సభ్య దేశాల్లో పెద్దయెత్తున సైనిక స్థావరాలను ఏర్పాటుచేయడాన్ని రష్యా వ్యవతిరేకి స్తోంది. చివరికి ఉక్రెయిన్ కూడా నాటోలో చేరేందుకు యత్నించడంతో రష్యా సైనిక చర్యకు పూనుకుంది. సైనిక స్థావరంతో బాటు కీవ్ డానెట్స్క్, మరియపోల్ ప్రాంతాల్లో కూడా దాడులు చోటుచేస ుకున్నాయి. రాజధాని కీవ్ చుట్టూ ఉన్న వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యన్ దళాలు దాడులు తీవ్రతరం చేశాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య కాల్పుల విరమణ కోసం శనివారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయినా యూరప్ దేశాలు తమ దౌత్య యత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ నేతల మధ్య , అలాగే పుతిన్‌తో ఈ రెండు దేశాల నేతలు ఫోన్లో చర్చలు జరిపారు. ఈ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసేలా అమెరికా ఉక్రెయిన్‌కు మరో 20 కోట్ల డాలర్ల ఆయుధాలను అందజేసింది. మరియపోల్‌పై దాడికి ముందు 1500 మంది పౌరులను మానవతా కారిడార్‌కు తరలించినట్లు రష్యా సైన్యం తెలిపింది. మరియపోల్ తూర్పు ప్రాంతాన్ని మట్టుడించడం ద్వారా వ్యూహాత్మకంగా కీలకమైన రేవు తమ వశమవుతుందని రష్యా భావిస్తున్నది.2014లో తాము స్వాధీనం చేసుకున్న క్రిమియాతో ఈ ప్రాంతాన్ని అనుసంధానించడం ద్వారా అజోవ్ సముద్ర తీరంపై చుట్టూ ల్యాండ్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలన్నది రష్యా వ్యూహం. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యన్ దళాలు దాడులను తీవ్రతరం చేయనున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో అక్కడి తన రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా పోలండ్‌కు తరలించాలని భారత్ నిర్ణయించింది. భయానక ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ ఆదివారం వెల్లడించింది.ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న పరిస్థితిపై ఆదివారం క్యాబినెట్ సమావేశంలో చర్చించారు. ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితి గురించి రక్షణ శాఖ వివరించింది. అలాగే ఈ సమావేశంలో దేశ భద్రతా సంసిద్ధతను కూడా చర్చించారు. మరోవైపు రష్యాతో సరిహద్దులు పంచుకుని, నాటో సభ్య దేశాలుగా ఉన్న ఎస్తోనియా, లిథువేనియా, రుమేనియాల్లో ఇప్పుడున్న తమ సైనికులకుతోడుగా మరో 12వేల మంది సైనికులను అమెరికా పంపింది. రష్యా సైన్యం దూసుకొస్తుండటంతో రాజధాని కీవ్‌ను రక్షించుకోవడానికి ఉక్రెయిన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శనివారం అర్ధరాత్రి సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ప్రసంగంలో 'ఉక్రెయిన్ను జయించే శక్తి లేదా ఆత్మ రష్యన్లకు లేదు' అని జెలెన్స్కీ ప్రకటించారు.