Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 లక్షల నివాసాలకు కరెంట్ కట్
టోక్యో : జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. టోక్యో నగరానికి సమీపంలో సముద్ర తీరమైన ఫుకుషిమా ప్రాంతంలో బుధవారం రాత్రి 9.15 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.36 గంటలకు) ఈ భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ ఏజెన్సీ తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదైంది. భూ ఉపరితలం నుంచి 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది. భూకంపం సంభవించిన వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది. అయితే టోక్యోలో భూమి కొన్ని నిమిషాల పాటు కంపించడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్టు టోక్యో విద్యుత్ సరఫరా సంస్థ (టీఈపీసీఓ) తెలిపింది. దీంతో కాంటో ప్రాంతంలో సుమారు 20లక్షలకు పైగా నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు తెలిపింది. అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం ప్రధాని కార్యాలయం వద్ద టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. పలు మంత్రిత్వశాఖలు, మున్సిపాల్టీలు పరస్పర సహకారంతో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఆదేశించారు.