Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా హెచ్చరిక
- చర్చలే పరిష్కారమార్గమని పునరుద్ఘాటన
- రష్యాకు సైనిక సాయంపై వార్తలకు ఖండన
- త్వరలో శాంతి ఒప్పందం ?
ఐక్యరాజ్య సమితి, కీవ్, మాస్కో : ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు విధించడం వల్ల సంక్షోభం పరిష్కారం కాదని, పైగా కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని ఐక్యరాజ్య సమితిలో చైనా శాశ్వత ప్రతినిధి ఝాంగ్ జున్ సోమవారం వ్యాఖ్యానించారు. సంక్లిష్టమైన చారిత్రక నేపథ్యం, ప్రస్తుత కారణాలు రెండూ కలగలిసిన ఫలితమే ఉక్రెయిన్‌లో నేటి సంక్షుభిత పరిస్థితులని అన్నారు. సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రశాంతంగా, సహేతుకతతో కూడిన ఆలో చనా ధోరణి అత్యంత అవస రమని అన్నారు. యూరప్ లో సహకార, భద్రతా సంస్థ (ఒఎస్‌సిఇ) ఛైర్ పర్సన్ జరిపిన భద్రతా మండలి బ్రీఫింగ్లో ఝాంగ్ మాట్లాడారు. రష్యాపై ఆంక్షలను ము మ్మరం చేయడం వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, ఆహారం, రవాణా, సరఫరా గొలుసులు, ఇతర రంగాలన్నీ తీవ్రంగా ప్రభావితమవుతాయని అన్నారు. ఇప్పటికే కోవిడ్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. ఇప్పుడీ యుద్ధం, ఫలితంగా ఆంక్షలు వల్ల ప్రజల జీవనోపాధులపై ప్రతికూల ప్రభావం వుంటుందని, ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా వుంటుందని అన్నారు. ఈ తరుణంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అంతర్జాతీయ సమాజం మరింత ఎక్కువగా దౌత్య ప్రయత్నాలు చేపట్ట్లాలని కోరారు. ఉక్రెయిన్ సమస్యకు రాజకీయ పరిష్కారాన్ని తక్షణమే కనుగొనాలని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలోని సంబంధిత పక్షాలతో కమ్యూనికేషన్‌ను, సమన్వయాన్ని చైనా బలోపేతం చేసుకుంటుందని ఝాంగ్ చెప్పారు. శాంతి స్థాపన కోసం చర్చల క్రమాన్ని మెరుగుపరచడంలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు రష్యా, ఉక్రెయిన్లు పలు దఫాలు ప్రత్యక్ష చర్చలు జరిపారని, మరింతగా కొనసాగించడానికి కూడా సుముఖంగా వున్నాయని తెలిపారు. ఈ సానుకూల పరిణామాన్ని, పరిస్థితులను మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి అంతర్జాతీయ సమాజం కృషి చేయాలని అన్నారు. ఉక్రెయిన్‌లో సంక్షోభం యూరప్ భద్రతా, సుస్థిరతలతో ముడిపడి వుందని అన్నారు. యూరప్ సహకార భద్రతా సంస్థ (ఒఎస్‌సిఇ) పూర్తి స్థాయిలో కృషి చేసి చర్చలకు, సంబంధిత పక్షాల మధ్య కమ్యూనికేషన్‌కు అవస రమైన వేదికను ఏర్పాటు చేయాలని కోరారు. పౌరుల భద్రతకు, వారి మౌలిక అవసరాలు తీరేలా హామీలు కల్పిం చాల్సి వుందన్నారు. విస్తృత స్థాయిలో సంక్షోభం పెచ్చరిల్ల కుండా వుండాలంటే మరిన్ని సురక్షితమైన, ఎలాంటి అవరోధాలు లేని మానవతా కారి డార్లు ఏర్పాటు చేయా ల్సిన అవసరం వుంద న్నారు. ఉక్రెయిన్‌కు మాన వతా సాయాన్ని చైనా అందిస్తోం దని చెప్పారు.
అమెరికా, చైనా ఘర్షణ
రష్యాకు సైనిక సాయం అందించే విషయమై అమెరికా, చైనాల మధ్య ఘర్షణ నెలకొంది. రష్యాకు సైనిక సాయం అందించే విషయమై చైనా ఆలోచిస్తోందంటూ అమెరికా ఆరోపిస్తూ ఇలాంటి వాటిని అనుమతించబోమని పేర్కొంది. దీనిపై చైనా దీటుగా స్పందించింది. ఇదంతా తప్పుడు సమాచారమని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ సమస్యపై తమ వైఖరికి మసిపూస్తున్నారని చైనా ప్రతినిధులు విమర్శించారు. రోమ్‌లో ఇరు దేశాల అధికారులు సమావేశమై ఉక్రెయిన్‌పై రష్యా దాడులపై చర్చించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యాంగ్ జియాచితో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ సమావేశమయ్యారు. అమెరికా, చైనాల మధ్య ఎలాంటి అరమరికలు లేని కమ్యూనికేషన్ కొనసాగించాల్సిన అవసరాన్ని ఇరు దేశాల అధికారులు నొక్కిచెప్పారు. ఉక్రెయిన్‌పై దాడులు జరిపిన నేపథ్యంలో రష్యాకు సాయం చేసేలా, రష్యా నష్టాలను భర్తీ చేసేలా ఏ దేశమైనా వ్యవహరిస్తే తాము అనుమతించబోమని బీజింగ్‌కు స్పష్టం చేసినట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్ విషయంలో చైనా సాయాన్ని అమెరికా కోరుతోంది. రోమ్ చర్చల్లో దీనిపై ప్రధానంగా చర్చ జరిగిందని అమెరికా చెబుతుండగా, ఇదొక్కటే కాదని, దీర్ఘకాలంగా విభేదాలు నెలకొన్న సమస్యలపై కూడా చర్చ జరిగిందని బీజింగ్ చెబుతోంది.
రష్యాతో డాలర్‌యేతర వాణిజ్యంపై భారత్ దృష్టి
ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల్లో రష్యాపై అంతర్జాతీ యంగా నెలకొన్న ఆంక్షలను దృష్టిలో వుంచుకుని డాలర్‌యేతర వాణిజ్యంపై భారత్ దృష్టి సారించింది. దేశీయ కరెన్సీ రూపాయిని ఉపయోగించి, రాయితీ ధరలకు రష్యా ముడి చమురును, ఇతర సరఫరాలను కొనుగోలు చేసే అంశాన్ని భారత్ పరిశీలి స్తోంది. రష్యాతో వాణిజ్యం జరపవద్దని అమెరికా అన్ని దేశాలను కోరు తున్న తరుణంలో భారీ రాయితీ ఇవ్వ డానికి రష్యా ముందు కొస్తోంది. ఆ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తు న్నట్లు భారత సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యా నించారు. అమెరికా డాల ర్ను, ఇతర ఆంక్షల విధానాలను తప్పించుకోవ డానికి భారత్, రష్యా దేశీయ కరెన్సీల్లో లావాదేవీలు జరపాలని భావిస్తున్నారు.
పౌరులకు పెద్ద ఎత్తున ఆయుధాలు
యుద్ధంలో పాల్గొనాలని కోరుతూ ఉక్రెయిన్ ప్రభుత్వం పౌరులకు పెద్ద ఎత్తున ఆయుధాలు అందచేస్తోంది. వేలాది అసాల్ట్ రైఫిళ్ళను ఇప్పటివరకు పంపిణీ చేసినట్లు హోం మంత్రి డెనిస్ వెల్లడించారు. ఉక్రెయిన్ ప్రజలను ప్రతిఘటనా దళంగా మార్చడమే ఈనిర్ణయం వెనుక వున్న లక్ష్యమని చెప్పారు. సైనికులు, పోలీసు అధికారులు వంటి శిక్షణ పొందిన సిబ్బందికి ఇచ్చే ఆయుధాలను ప్రజలకు ఇవ్వడం ఆరంభించారు.
ఇరు వైపులా నష్టమెంత ?
గత 19 రోజుల యుద్ధంలో రష్యా 80 యుద్ధ విమానాలను కోల్పోయిందని ఉక్రెయిన్ నేత జెలెన్స్కీ తెలిపారు. మంగళవారం వీడియో ప్రసంగంలో మాట్లాడుతూ ఆయన, వందలాది ట్యాంకులను, వేలాది ఇతర యూనిట్ల పరికరాలను రష్యా నష్టపోయిందన్నారు. 1300 ఉక్రెయిన్ ట్యాంకులను, ఇతర సాయుధ వాహనాలను, దాదాపు 600 శతఘ్నులను, 145 డ్రోన్లను ధ్వంసం చేశామంటూ సోమవారం సాయంత్రం రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.
రష్యా ఇంధనంపై ఆంక్షల ప్రభావం
రష్యా నుండి వచ్చే ఇంధన సరఫరాలపై ఆంక్షలు విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుందని, సాధారణ ప్రజల జీవితాలు మరింత దుర్భరమవుతాయని జర్మనీ ఆర్థిక మంత్రి రాబర్ట్ హేబెక్ వ్యాఖ్యానించారు. రష్యా శిలాజ ఇంధనాలపై జర్మనీ చాలా ఎక్కువగా ఆధారపడిందని అన్నారు. వెంటనే సరఫరాలను నిలిపివేస్తే సరఫరాల్లో కోతలే కాదు, మొత్తంగా నిలిచిపోవచ్చు కూడా. మూకుమ్మడిగా నిరుద్యోగం, దారిద్య్రం పెరుగుతుందని హెచ్చరించారు. ప్రజలకు పెట్రోల్ కొరత ఏర్పడుతుందని, ఇళ్ళల్లో వెచ్చగా వుండే పరిస్థితి లేకుండాపోతుందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరిమీద ఆధారపడకుండా వుండేందుకు నెమ్మదిగా ఒకో చర్య తీసుకుంటున్నామన్నారు. రష్యాపై జపాన్, అమెరికా ఆంక్షలు విస్తరిస్తూ చర్యలు తీసుకున్నాయి. మరో 17మంది రష్యన్ల ఆస్తులను స్తంభింపచేస్తున్నట్లు జపాన్ ఆర్థిక శాఖ ప్రకటించింది. దీంతో రష్యాలో ఇలా ఆంక్షలు ఎదుర్కొంటున్న ఓలిగార్క్‌ల సంఖ్య 61కి చేరింది. అమెరికా అంతకుముందు 11మంది ఎంపీలతో సహా పలువురు ప్రముఖులపై ఆంక్షలు విధించింది.
త్వరలో శాంతి ఒప్పందం ?
రాబోయే వారాల్లో రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరే సూచనలు వున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారుడు అలెక్సీ అరెస్టోవిక్ తెలిపారు. ''బహుశా మే నాటికి, అంటే మే మొదట్లోనే శాంతి ఒప్పందం కుదరవచ్చునని భావిస్తున్నాను. లేదా అంతకంటే ముందుగానే కుదరవచ్చు. అది ఎలా అమలవుతుందో మనం చూడాల్సివుంది.'' అని అన్నారు. ముందుగా ఒకటి రెండు వారాల్లో రష్యాబలగాల ఉపసంహరణపైనైనా ఒప్పందం కుదరాల్సి వుందన్నారు. సోమవారం జరిగిన వీడియో సమావేశం నిర్మాణాత్మకంగా సాగిందని అన్నారు. 'వ్యక్తిగత నిర్వచనాల వివరణ' కోస మంగళవారం వరకు 'సాంకేతిక విరామం' తీసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి మరో సలహాదారు మైఖాయిలో పొడొలాక్ చెప్పారు. అంతకుముందు మరియుపోల్ వంటి నగరాల నుండి పౌరుల తరలింపునకు అనుసరించే మార్గాలపై ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది.