Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర మతాల పట్ల కూడా వివక్ష పెరుగుతోందని ఆవేదన
న్యూయార్క్ : మార్చి 15ను అంతర్జాతీయ ముస్లింలపై వివక్షకు వ్యతిరేకంగా దినోత్సవం (ఇస్లామోఫోబియా)గా ప్రకటించే ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. ప్రపంచంలో ఇతర మతాల పట్ల వివక్ష పెరిగిపోతోందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు.యూదులు, క్రైస్తవులు, ముస్లింలపై వివక్షను భారతదేశం వ్యతిరేకిస్తుందని, అయితే అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడమే ఒక మతాన్ని, దానిపై జరిగిన దురాగతాలను వ్యతిరేకించడానికి ఏకైక మార్గం కాదని అని ఆయన తెలిపారు.ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ రాయబారి మునీర్ అక్రమ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఐరాస ఆమోదించింది.