Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీవ్ : రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ఇరు దేశాలకు చెందిన 15 మంది సభ్యుల శాంతి ప్రక్రియ బృందం సమావేశమయింది. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో యుద్ధం ముగింపునకు 15 ప్రతిపాదనలు చేశారు. ప్రధానంగా ఉక్రెయిన్ నాటోలో చేరకూడాదని, తటస్థతను కొనసాగించాలని ప్రతిపాదించారు. అలాగే అమెరికా, ఇంగ్లండ్, టర్కీ వంటి మిత్రదేశాలు అందించే భద్రతా హామీలతో విదేశీ దళాలు లేదా ఆయుధాలను సమకూర్చుకోకూడదు. వీటికి కట్టుబడి ఉంటామని హామీ ఇస్తే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని రష్యా తెలిపింది. అలాగే తన దళాలను ఉపసంహరించుకుంటామని చెప్పింది. బుధవారం జరిగిన చర్చల్లో గణనీయమైన పురోగతి కనిపించిందని ఇరుపక్షాలు స్పష్టం విశేషం. ఉక్రెయిన్ తటస్థంగా ఉండటానికి అంగీకరిస్తే కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ సెలెన్స్కీ మాట్లాడుతూ బుధవారం జరిగిన నాల్గవ రౌండ్ 'వాస్తవిక చర్చ' అని అన్నారు. అయితే రష్యా ఆక్రమించిన ప్రాంతాలను విముక్తి చేయాలని చెప్పారు.