Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధ్వంసమైన విమానాల మరమ్మతు కేంద్రం
కీవ్,మాస్కో : పశ్చిమ ఉక్రెయిన్‌లోని లివివ్‌లో విమానాశ్రయానికి సమీపంలో క్షిపణుల దాడి జరిగిందని నగర మేయర్ ఆండ్రీ సదొవీ శుక్రవారం తెలిపారు. దీంతో విమానాల మరమ్మతుల కర్మాగారం ధ్వంసమైందన్నారు. అయితే ఈ దాడిలో ఎవరూ మరణించలేదు.
కాగా ఉక్రెయిన్‌లోని డాన్బాస్ ప్రాంతంలో రష్యా, నో ఫ్లై జోన్‌ను విధించిందని అధికారిని ఉటంకిస్తూ ఇంటర్ఫాక్స్ వార్తా సంస్థ తెలిపింది. ఉక్రెయిన్‌కు అందచేయాల్సిన మద్దతు, సాయంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో టెలిఫోన్లో సంభాషించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. కాగా, ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న చర్చల క్రమంలో భాగంగా శాంతియుత చర్చల కొనసాగింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. రెండు వారాల్లోపై శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు వున్నాయని జెలెన్స్కీ సలహాదారు చెప్పారు.