Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరియుపోల్‌లో థియేటర్‌పై క్షిపణి దాడి..
- ఉక్రెయిన్‌లో 300 మంది మృతి..?
కీవ్: ఉక్రెయిన్ భీకర దాడులతో దద్దరిల్లుతోంది. కీవ్, ఖర్కివ్, మరియుపోల్ వంటి నగరాల్లో క్షిపణులు, బాంబు దాడులతో విజంభిస్తున్నాయి. మరియుపోల్‌లో ఓ థియేటర్‌పై రష్యా జరిపిన బాంబు దాడిలో 300 మంది మతిచెందినట్టు సమాచారం. ఉక్రెయిన్ వ్యూహాత్మక ఓడరేవు నగరమైన మరియుపోల్‌లో వందల మంది ఆశ్రయం పొందుతున్న థియేటర్‌పై గత వారంలో రష్యా జరిపిన దాడుల్లో 300 మంది మతిచెంది ఉంటారని అధికారులు తెలిపినట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. మరియుపోల్‌లోని ఓ డ్రామా థియేటర్‌పై రష్యా జరిపిన దాడిలో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
గత నెలరోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో లక్షలాది ప్రజలు తాగునీరు, ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. రష్యా బలగాల షెల్లింగ్ దాడులతో బిక్కుబిక్కుమంటున్నారు. చిన్నారులు, మహిళల పరిస్థితి మరీ దయనీయంగా మారింది.