Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఇమ్రాన్
- అవిశ్వాస తీర్మానంపై 3న ఓటింగ్
ఇస్లామాబాద్ : అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు రాజీనామా చేసే ప్రశ్నే లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఆయన గురు వారం జాతినుద్దేశించి టీవిలో ప్రసంగిస్తూ, తాను చివరి బంతి దాకా పోరాడతానని అన్నారు. ఏప్రిల్ 3న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనున్నందున, దానికి ముందు తాను రాజీనామా చేసే ప్రశ్నే లేదన్నారు. దేశం నిర్ణయాత్మక దశకు చేరుకుంద న్నారు. తాను రాజకీయాల్లో చేరినప్పుడు న్యాయం, మానవత్వం, స్వావలంబన అనే మూడు లక్ష్యాలను నిర్దేశించుకున్నాను, అవి ఇంకా నెరవేరనే లేదన్నారు. తనకు మద్దతు ఉపసంహరించుకున్న వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ, 'అవిశ్వాస ఓటింగ్‌కు ముందు అమ్ముడు పోయిన మిమ్మల్ని, వెనకుండి నడిపిస్తున్న వారిని జాతి ఎన్నటికీ క్షమించబోదు' అని అన్నారు. 'నాకన్నా పాకిస్తాన్ అయిదేళ్లుపెద్ద . నా తల్లిదండ్రులు బానిస యుగంలో పుట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక నేను పుట్టడం నా అదృష్టం' అన్నారు. ప్రతి పక్షంలో ఉన్న వారు సొంతంగా పెట్టిన అవిశ్వాస తీర్మానం కాదిది, విదేశాల్లో ఉన్న కొందరు డిక్టేట్ చేస్తే ఇక్కడ దానిని ఫాలో అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలున్నా యని అన్నారు. 'ఇమ్రాన్‌ఖాన్ అధికారంలో ఉన్నంతకాలం మీతో మా సంబంధాలు కొనసాగడం కష్టమవుతుంది' అని పేర్కొన్న పత్రాన్ని ఆయన ఈ సందర్భం గా ఉటంకించారు. అంతకుముందు అవిశ్వాస తీర్మా నంపై ఎలాంటి చర్చను ప్రారంభించకుండానే జాతీయ అసెంబ్లీ ఆదివారానికి వాయిదా పడింది. 342 మంది సభ్యులున్న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజారిటీ 172 ఈ మ్యాజిక్ ఫిగర్‌ను ప్రతిపక్షం ఇప్పటికే సంపాదించు కుంది.