Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : సోవియట్ యూనియన్ను కట్టడి చేసే లక్ష్యంతో ఏర్పాటైన నాటోను సోవియట్ విచ్ఛిన్నమైన తర్వాత రద్దు చేసి వుండాల్సిందని చైనా అభిప్రాయపడుతోందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ చెప్పారు. కానీ, రద్దు చేయడానికి బదులుగా, దాన్ని విస్తరించుకుంటూ పోయారని, రష్యాను ఇరుకున పెట్టేలా వ్యవహరించారని, దాంతో ఉక్రెయిన్లో రక్తపాతానికి కారణమయ్యారని విమర్శించారు. ''ప్రచ్ఛన్న యుద్ధం ఫలితంగా ఆవిర్భవించిన నాటో, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత చరిత్రగా మారి వుండాల్సింది.'' అని ఆయన శుక్రవారం నాటి పత్రికా సమావేశంలో వ్యాఖ్యానించారు.